లారీ… చోరీ…
-కాగజ్ నగర్ నుంచి లారీ ఎత్తుకెళ్లిన దొంగలు
-ఇప్పటికే మూడు లారీల చోరీ
-కేసులను ఛేదించలేకపోతున్న పోలీసులు
The thieves who stole the lorry: బస్టాండ్ సమీపంలో నిలిచిఉంచిన లారీని కొందరు దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రెండు రోజుల కిందట కాగజ్‌నగర్ బస్టాండ్ సమీపంలో నిలిపి ఉంచిన లారీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ లారీ రెండు రోజుల కిందట (ఈనెల 17న) రాత్రి 11.30 ప్రాంతంలో సిర్పూర్(టి) వద్ద రాష్ట్ర సరిహద్దులు దాటినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఇక్కడ నుంచి దాదాపు మూడు లారీలు చోరీకి గురయ్యాయి. ఆ కేసులను ఇప్పటి వరకూ పోలీసులు ఛేదించలేకపోయారు. ఈ లారీ చోరీ విషయంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లారీని దొంగతనం చేస్తున్న నిందితులు నాగ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఖార్ఖానాకు తీసుకువెళ్లి అక్కడ పార్టులుగా విడగొట్టి అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లో లారీ పూర్తిగా రూపురేఖలు లేకుండా మార్చేస్తున్నారు. దీంతో పోలీసులకు సైతం ఈ లారీ దొంగతనాలకు సంబంధించిన వ్యవహారం పెను సవాల్‌గా మారింది.