చలిపులి వణికిస్తోంది
-ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
-సింగిల్ డిజిట్‌కే పరిమితం
-చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం
Falling temperatures: ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటిపూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం అయిందంటే చాలు చలి పెరుగుతూ రాత్రి వరకు ఎక్కువై జనాన్ని గజగజవణికిస్తోంది. ఉదయం కూడా పొద్దెక్కే వరకు చలి వదలడం లేదు. చలి ప్రభావం మరింతగా పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
కొమురం భీం జిల్లా లో 7.3, ఆదిలాబాద్ జిల్లాలో 8.3, నిర్మల్ జిల్లా లో 9.2, మంచిర్యాల జిల్లా లో 9.5 డిగ్రీలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరోవైపు ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. వచ్చే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.