ఆంధ్ర పోలీసులు…. అన్య‌మ‌త ప్ర‌చారం..

Andhra Police….Propagation of Paganism: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు జారీ చేసిన చలాన్ల ర‌శీదుల‌పై అన్య‌మ‌త ప్ర‌చారం క‌ల‌క‌లం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగ‌డంతో పోలీసులు వెన‌క‌డుగు వేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశాఖ సిటీ పోలీసులు చేసిన ప‌ని తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

ఓ ఆటో డ్రైవ‌ర్ (ఏపీ 31 టీఏ 8820) రైల్వే స్టేష‌న్ నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లే మార్గంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని పోలీసులు 80 రూపాయ‌లు చ‌లానా విధించారు. అయితే, ఆ ర‌శీదుపై ఏసుక్రీస్తుకు సంబంధించిన ఫొటో, కీర్త‌న వివాదానికి దారి తీసింది. ఆ ర‌శీదును కొంద‌రు వ్య‌క్తులు ట్విట్ట‌ర్‌లో, సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది పెద్ద రచ్చ‌కు దారి తీసింది.

కొంద‌రు వ్య‌క్తులు ఏకంగా.. ఇది క్రైస్తవ దేశమా లేక ఓ క్రైస్తవ వ్య‌క్తి పాలించడం ద్వారా క్రైస్తవ రాజ్యంగా మారిందా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అంతేకాకుండా, రాజ‌కీయ పార్టీలు సైతం పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు దిగాయి. దీంతో త‌ప్పు గ్ర‌హించిన పోలీసులు దానిపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఇది ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌రిగింది కాద‌ని, ఆ ర‌శీదులు అన్నీ ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like