రక్తదానం ప్రాణదానంతో సమానం
Donation of blood is equivalent to donation of life: రక్తదానం ప్రాణదానంతో సమానమని మార్వాడి యువమంచ్ అధ్యక్షుడు గోపాల్ శర్మ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ
అత్యవసర పరిస్థితుల్లో దాతలు ఇచ్చే రక్తం ప్రాణాలను నిలబెడుతుందని అన్నారు. రక్తదాన ఆవశ్యకత గుర్తించి రక్త దాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ సెక్రటరీ గోపాల్ వ్యాస్, ట్రెజరర్ సూర్య ప్రకాష్ లోహోటి, బ్రిజ్ మోహన్ రేన్వా తదితరులు పాల్గొన్నారు.