15 యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్లకి నోటీసులు
Cyber crime police notices to YouTube channels and websites: 15 యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్లకి సైబర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. పవిత్రాలోకేష్ ఫిర్యాదు మేరకు వారు ఈ నోటీసులు జారీ చేశారు. పవిత్ర లోకేష్, సినీ నటుడు, కృష్ణ కొడుకు నరేష్ సహజీనం గడుపుతున్నారు. ఇటీవలే కృష్ణ మరణించినప్పుడు కూడా నరేష్, పవిత్ర లోకేష్ జంటగానే వచ్చారు. ఈ నేపథ్యంలో వీరిపై సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ వచ్చాయి.
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరీ ముందుకెళ్లి అసభ్యకరమైన వీడియోల్ని కూడా పోస్ట్ చేశారు. ఫోటోలు సైతం మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. దీంతో పవిత్ర లోకేష్ వీటిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది.
శనివారం ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం విచారణ మొదలుపెట్టారు. ఈ కేసులో 15 యూట్యూబ్ ఛానళ్లకి, పవిత్ర ఫిర్యాదులో పేర్కొన్న వెబ్‌సైట్స్‌కి నోటీసులు పంపించారు. మూడు రోజుల్లోగా విచారణకి రావాలని లేకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో తెలిపారు.