బండి సంజయ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్
బండి పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. భైంసాలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర చేసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. భైంసాలో సభ నిర్వహించొద్దని తెలిపింది. భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ పెట్టుకోవచ్చు అని హైకోర్టు వెల్లడించింది. నిర్మల్ మీదుగా పాదయాత్ర చేపట్టాలని.. అందులో 500 మంది మాత్రమే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. సభకు 3 వేల మంది మాత్రమే ఉండాలని తెలిపింది.
పాదయాత్రలో, సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. సభకు పోలీసులు తప్పకుండా సహకరించాలని సూచించింది.
కోర్టు సూచనల మేరకు పాదయాత్ర నిర్వహిస్తామని బీజేపీ నేత, పాదయాత్ర ఇంఛార్జ్ గంగిడి మనోహర్ తెలిపారు. సోమవారం సమయం లేనందున మంగళవారం నుంచి పాదయాత్ర, సభ నిర్వహిస్తామని చెప్పారు.