విధుల్లో చేరిన అంగన్వాడీ సూపర్వైజర్లు
Anganwadi Supervisors who joined the duties: అంగన్వాడీ నూతన సూపర్ వైజర్లు విధుల్లో చేరారు. సోమవారం నూతనంగా ఎంపికైన వారికి జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రకియ పూర్తి కాగా, మంచిర్యాల జిల్లాలో సైతం పూర్తి అయ్యింది.
వాస్తవానికి ఈ ప్రక్రియ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా కోర్టు కేస్ తో ఆలస్యం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి నోటిికేషన్ జారీ చేసింది. పరీక్షలు ముగిసి రిజల్ట్ రాగానే దానిపై కొందరు కోర్టుకు వెళ్లారు.
అయితే కోర్టు మాత్రం అన్ని సవ్యంగా జరిగాయని పోస్టుల భర్తీ చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు పోస్టుల భర్తీ పూర్తి చేశారు. ఎన్నో ఎండ్లుగా ఖాళీగా ఉన్న సూపర్ వైజర్ పోస్టులు భర్తీ కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.