ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ కార్మికులపై లేదు
-జాతీయ కార్మిక సంఘాలు నిర్లిప్తత విడనాడాలి
-టీబీజీకేస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్
TBGKS leader Medipally Sampath fires on national trade unions: జాతీయ కార్మిక సంఘాలు నిర్లిప్తత విడనాడి, కార్మికులకు మెరుగైన వేజ్‌బోర్డు సాధించాలని టీబీజీకేస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ డిమాండ్ చేశారు. మంగళవారం వేజ్ బోర్డుపై జాతీయ కార్మిక సంఘాల వైఖరికి నిరసనగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మందమర్రి ఏరియా కేకే5 గనిపై చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 11వ వేజ్‌బోర్డు కాలపరిమితి ముగిసినా జాతీయ కార్మిక సంఘాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల మీద శ్రద్ధ కార్మికులపై పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు 18 నెలల IR వెంటనే చెల్లిం చేలా చూడాలన్నారు. కార్మికుల శ్రేయస్సు పైన దృష్టి ఉంటే సమస్య పరిష్కరించడంలో దృష్టి పెట్టాలని అన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ఏదో సాధించమని గొప్పలు చెప్పుకుని మానుకోవాలని హితవు పలికారు.
ఈ సందర్బంగా గనిపై నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ గని మేనేజర్ కి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పిట్ సెక్రటరీ జీడి బాపు, టిసారయ్య, జి.రామచందర్, సాతిని రాజేందర్, మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, బొడ్డు మల్లేష్, పెండం కృష్ణ సాయి రవి యాదవ్,మోతుకూరు రాజేందర్, నాగరాజు, రాజు, కాపర్ బోయిన శ్రీకాంత్, మల్లయ్య,మొగిలి, కొప్పు లక్ష్మణ్, గోపికృష్ణ, జరుపుల ప్రేంలాల్, ప్రశాంత్, రవితేజ, అత్రం మారుతి తదితరులు పాల్గొన్నారు.