కార్మికుల పై శ్రద్ధ లేదు.. సమస్యల పట్ల అవగాహన లేదు
జాతీయ కార్మిక సంఘాలపై "ఏనుగు" ధ్వజం

“Enugu Ravinder Reddy” flag on national trade unions:జాతీయ కార్మిక సంఘాల నాయకులకు కార్మికుల పై శ్రద్ధ లేదని, ఇక్కడ సమస్యల పట్ల అవగాహన లేదని కార్పొరేట్ చర్చల ప్రతినిధి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. మంగళ వారం 11వ వేజ్ బోర్డు త్వరగా పరిష్కరించాలని గనులు, డిపార్టుమెంటల వద్ద TBGKS నిరసన వ్యక్తం చేసింది. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
వేతన సంఘం చర్చలకు వెళ్లిన నేతలు అక్కడ ఏం మాట్లాడకుండా అధికారులూ చెప్పిన దానికి తల ఊపుతూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేపు బుధవారం జరిగే వేతన ఒప్పదం చర్చల్లో గతంలో కంటే మెరుగైన ఒప్పందం అదీ పూర్తీ స్తాయి ఒప్పందాన్ని చేసుకోవాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఓటూ జీఎం త్యాగరాజుకి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కోపిట్ కార్యదర్శి పి.వి.రావు, ఏరియా నాయకులు రాళ్లబండి రాజన్న, సహాయ కార్యదర్శి ఆకుల అఖిల, సాంబయ్య, రవీందర్ రెడ్డి, బాపయ్య అరుంధతి నాగలక్ష్మి, వాసవి, దివ్య, మాసాడి శ్రీనివాస్. కే. వెంకటయ్య, సంధ్య,సురేష్, స్వామి,నవీన్ తదితరులు పాల్గోన్నారు. .