ఆ బాబు పేరు నరేంద్ర మోదీ
మూడు నెలల బాబుకి నామకరణం చేసిన బండి సంజయ్
modi-named-three-month-old-baby-boy-bandi-sanjay: ఆ దంపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే చాలా ఇష్టం. దీంతో వారు తమ పిల్లాడికి ఆ పేరే పెట్టాలనుకున్నారు. మంగళవారం బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఆయన చేతుల మీదుగా ఆ నామకరణాన్ని ముచ్చటను జరిపించుకున్నారు.
నిర్మల్ జిల్లా భైంసాలోని కోర్వగల్లీ కి చెందిన ఎడ్ల మహేష్, నాగ జ్యోస్న దంపతులకు మూడు నెలల బాబు ఉన్నాడు. వారికి నరేంద్ర మోదీ అంటే ఎంతో ఇష్టం. దీంతో వారు ఆ బాబుకి నరేంద్రమోదీ పేరు పెట్టాల్సిందిగా బండి సంజయ్ ని కోరారు. వారి కోరిక మేరకు బాబుకు విశ్వేష్ నరేంద్రమోదీ అని బండి సంజయ్ నామకరణం చేశారు.