గుర్తుకొస్తున్నాయి..
-చిన్ననాటి స్నేహితులను కలిసిన బండి
-స్నేహితుడికి సన్మానం చేసిన సంజయ్
-బాల్య స్మృతులను గుర్తు చేసుకున్న బీజేపీ చీఫ్
bjp-chief-remembers-childhood-memories: పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తన చిన్ననాటి స్నేహితుడికి సన్మానం చేశారు. శనివారం సాయంత్రం ఆయనను పలువురు చిన్న నాటి మిత్రులు కలిశారు. వీరంతా కరీంనగర్ లోని సరస్వతి శిశుమందిర్ లో బండి సంజయ్ తో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు కావడం గమనార్హం. వీరిలో తాండూర్ కంటి వైద్యాధికారి గా పనిచేసిన సందవేని మహేంద్ర నాథ్ యాదవ్ ఇటీవల స్వచ్చంద పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో మహేంద్ర నాథ్ యాదవ్ తన కుటుంబ సభ్యులు, బాల్యమిత్రులతో సంజయ్ ను కలిశారు. మహేంద్ర నాథ్ యాదవ్ ను శాలువా కప్పి సన్మానించిన బండి సంజయ్ వారి కుటుంబ సభ్యులు, బాల్య మిత్రులతో ఫోటోలు దిగారు. వారితో కలిసి చిన్ననాటి స్మృతులను నెమరువేసుకున్నారు. బాల్య మిత్రమండలి కన్వీనర్ బండి శ్రీనివాస్ అధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు , వెల్దండి వేణు, విశ్వనాథ అనిల్, చెన్నాడె ప్రవీణ్, సురేందర్ రెడ్డి, మంచాల రమేష్, తోట ప్రకాష్, పుల్లూరి రమేష్ తదతరులు పాల్గొన్నారు.