క్రాంతి కిరణ్ జన్మదినం సందర్బంగా దుప్పట్ల పంపిణీ
ఆంథోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జన్మదినం సందర్భంగా మంగళవారం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏసన్వాయి గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ సీమా నాయక్ పాల్గొని నిరుపేదలకు దుప్పట్లు అందించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసిన క్రాంతి కిరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామపంచాయతీ ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ముందుకు నడుస్తానని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం జిల్లా టియుడబ్ల్యూజే హెచ్ 143 కన్వీనర్ రవి నాయక్ తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.