ట్విట్టర్ టిల్లు… డ్రగ్స్ బానిస

-రక్త, వెంట్రుక నమూనాలిచ్చే దమ్ముందా?
-నమూనాలిస్తే అంతా నిరూపిస్తా
-హైదరాబాద్, బెంగళూరు డ్రగ్ కేసులను తిరిగి తెర‌వాల్సిందే
-జీ-20 నిర్వహణ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోవడం సిగ్గు చేటు
-అంబేద్కర్ జయంతి, వర్దంతిలకు హాజరుకాని మూర్ఖుడు కేసీఆర్
-అంబేద్కర్ స్ఫూర్తితో శక్తివంతమైన దేశంగా మార్చుతున్న గొప్ప నాయకుడు మోదీ
-ప్రజా సంగ్రామయాత్రలో బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay is angry with Govt: కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ మంగ‌ళ‌వారం నిర్మల్ జిల్లా మామ‌డ‌ మండలం దిమ్మదుర్తిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ‘‘నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా… నాకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా. అందుకోసం రక్త నమూనాలతోసహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇచ్చేస్తా…. మరి నీకు రక్తపు, రెండు వెంట్రుకల నమూనాలిచ్చే దమ్ముందా?’’అంటూ సవాల్ విసిరారు. ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారని అన్నారు. తక్షణమే ఆ కేసులు రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను కోరారు.

1400 మంది పేదోళ్ల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఈ సంద‌ర్బంగా బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులు, పేదోళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దొంగ సారా దందా చేసిన బిడ్డను కాపాడుకునేందుకే… కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఈ ప్ర‌భుత్వానికి దళిత బంధు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం పైసలు లేవు… దండుకోడానికి మాత్రం పైసలు ఉన్నాయని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల దిబ్బగా మార్చార‌ని, పుట్టబోయే ప్రతి బిడ్డపై లక్ష రూపాయలు అప్పు పెట్టిండని అన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీ పోయి లక్ష కోట్ల లిక్కర్ దందా చేసిందని, కేసీఆర్ కుటుంబం విదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే… తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయాలా? అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. లిక్కర్ దందా చేస్తే.. దర్యాప్తు సంస్థలు గుంజుకు పోవా? అన్నారు. లిక్కర్ దందా బ‌య‌ట ప‌డుతుంద‌ని కవిత 10 ఫోన్లను ధ్వంసం చేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో… ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకుందన్నారు. అవినీతిలో అయ్యకు తగ్గ బిడ్డగా కవిత గుర్తింపు పొందిందని బండి సంజ‌య్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. బెంగళూరు డ్రగ్స్, హైదరాబాద్ డ్రగ్స్ కేసును పక్కా రీఓపెన్ చేయిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదని బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీసం వారం రోజుల పాటైనా ఉత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాన‌ని అన్నారు. అంబేద్కర్ వర్ధంతి, జయంతిలకు TRS పార్టీ ఒక గంట సమయం కూడా కేటాయించదని సంజ‌య్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వారం రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ బస్తీలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తామ‌న్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ దేశాన్ని ప్రధాని మోదీ పాలిస్తున్నారని తెలిపారు. పార్లమెంటులో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన పార్టీ బీజేపీద‌ని స్ప‌ష్టం చేశారు. అంబేద్కర్ చరిత్ర ప్రపంచానికి తెలిపేందుకే ‘పంచ తీర్థాల’ పేరుతో అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు.

G20 దేశాల్లో భారతదేశానికి అధ్యక్షత వహించే అవకాశం రావడం మనందరికీ గర్వకారణం. జి20 సదస్సులో అందరి సూచనలను తీసుకునేందుకు, అన్ని పార్టీల అధ్యక్షులను మోదీ ఆహ్వానిస్తే… కేసీఆర్ ఎందుకు గైర్హాజరయ్యారు? జి 20 సన్నాహక సమావేశాని కంటే కేసీఆర్ కు ఇక్కడ పీకే పనేముందనీ ప్రశ్నిస్తున్నాను. ఈ స‌మావేశంలో ఆయ‌న‌తో పాటు ఎంపీ సోయం బాపూరావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, బీసీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్, గీతామూర్తి, జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవి రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న తదితరులు హాజరయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like