జిల్లా అధ్యక్షురాలిగా కొక్కిరాల
-రెండోసారి కూడా ఆమెనే వరించిన పదవి
-ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ప్రేంసాగర్ రావు
-రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా చిట్ల, రఘునాథ్ రెడ్డి
Surekha is the President of Manchyryala District Congress Party: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రెండవసారి కొక్కిరాల సురేఖను నియమించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు కేసి వేణుగోపాల్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. సురేఖ మంచిర్యాల జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆమె జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ పటిష్టానికి కృషి చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ తీరును ఎండగట్టారు. జిల్లా కమిటీ, మండల ,పట్టణ ,గ్రామ కమిటీలను నియమించి పార్టీ పురోగతికి ఎంతో కృషి చేశారు. సురేఖ సమర్థవంతంగా పనిచేయడంతో రెండవసారి జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది.
ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ప్రేంసాగర్ రావు..
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ పీసీసీకి జవసత్వాలు కల్పించడానికి నూతనంగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో మంచిర్యాలకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు కీలక పదవి లభించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఏఐసీసీప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ లేఖ జారీ చేశారు. అందులో 40 మంది సభ్యులను నియమించారు. మంచిర్యాల కు చెందిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును సైతం సభ్యుడిగా నియమించారు. ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు ఏఐసిసి సభ్యుడిగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా , జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా పనిచేశారు.
అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మంచిర్యాల కు చెందిన చిట్ల సత్యనారాయణ, రామకృష్ణాపుర్ కు చెందిన రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు.