మానవత్వం చాటుకున్న సఖి కేంద్రం నిర్వాహకురాలు
Humane Sakhi organizer of the center: ఎవరు ఎటు పోయినా మనకేంటి లే అనుకునే రోజులు ఇవి… కానీ ఆమె అలా అనుకోలేదు. తన వంతు సాయం చేసింది. సాటి మనిషిగా సాయం చేసింది.. వివరాల్లోకి వెళితే..
మంచిర్యాల జిల్లా గోదావరి రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి చలికి వణుకుతూ ఉన్నాడు. చాలా మంది అటు వైపు వెళ్తున్నా అతన్ని కనీసం పట్టించుకోలేదు. కానీ, మంచిర్యాల సఖీ సెంటర్ నిర్వాహకురాలు శ్రీలత మాత్రం అలా వదిలేయలేదు. కొత్త దుప్పటి తీసుకువచ్చి అతనికి అందించింది.
మనవంతు సాయంగా తోచిన విధంగా సాయం చేస్తే బాగుంటుందని అందరూ అంటారు.. అనుకుంటారు.. కానీ, నిజంగా అనుకున్న పనిచేస్తే ఈ లోకంలో బాధితులు అనే వారే ఉండరు.