ఆ కుటుంబాలకు అండగా ఉంటాం
-అగ్ని ప్రమాదం తీవ్రంగా కలచి వేసింది
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్
Balka Suman:మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 6గురు మృతి చెందడం పట్ల ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అవడం తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుటున్నానని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సుమన్ విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.