పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టివేత..
Counterfeit Liquor siege:తెలంగాణ రాజధాని హైదరాబాద్లో భారీ ఎత్తున నకిలీ మద్యం పట్టుబడింది. వేలు కాదు, లక్షలు కాదు.. కోటి రూపాయలకు పైగా విలువైన నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు హయత్నగర్ ఎక్సైజ్ పోలీసులు.
ఓ బెల్ట్షాపులో నకిలీ మద్యం అమ్ముతున్నారన్న సమచారం మేరకు పోలీసులు విచారణ నిర్వహించగా డొంక కదిలింది. సాధారణ మద్యం కొనుగోలుదారుల్లా బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేసిన ఎక్సైజ్ పోలీసులు అవి నకిలీవిగా గుర్తించారు. దీంతో ఆ బెల్ట్ షాపు నిర్వాహకున్ని అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, దేవల్లమ్మ నాగారం ఏరియాలో దాడులు చేసిన వారికి నకిలీ మద్యం డంప్ లభించింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు ఆ డంప్ స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఈ డంప్ అంతా దేవలమ్మ నాగారానికి చెందిన ఓ బడా మద్యం వ్యాపారికి చెందినదిగా గుర్తించారు పోలీసులు. తనపైకి కేసు రాకుండా రాజకీయంగా ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు.