రెండునెలల చంటిపాపతో అసెంబ్లీ సమావేశాలకు..
Maharastra Assembly: అటు తల్లిగా తన చిన్నారిని చూసుకుంటూనే తనను ఎన్నకున్న ప్రజల గురంచి ఆలోచించారామే… అందుకే తన రెండున్నల నెలల చిన్నారిని తీసుకుని మరీ అసెంబ్లీకి హాజరయ్యారు.
ప్రజా సమస్యలపై చర్చించేదుకు, వారి సమస్యలపై మాట్లాడేందుకు ఓ ప్రజాప్రతినిధి తన రెండున్నర నెలల పసి బిడ్డతో చట్టసభకు వచ్చి ఆదర్శంగా నిలిచారు. చంటి బిడ్డకు తల్లినని ఇంటి దగ్గరే ఉండిపోకుండా బాధ్యాయుతంగా వ్యవహరించిన ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని డియోలాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సరోజ అహిర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) తరఫున గెలుపొందారు. సెప్టెంబరు 30న ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చారు. నాగ్‌పూర్‌లోని మహారాష్ట్ర అసెంబ్లీకి తన రెండున్నర నెలల పాపతో వచ్చారు.
ఈ సందర్భంగా నాగ్‌పూర్ విధాన్ భవన్ వద్ద ఆమె మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పుడు ఒక తల్లిని, ప్రజాప్రతినిధిని కూడా.. కరోనా మహమ్మారి కారణంగా రెండున్నరేళ్లుగా నాగ్‌పుర్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదు… ఇప్పుడు ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రశ్నలను లేవనెత్తి వాటికి ప్రభుత్వం నుంచి సమాధానాలను రాబట్టేందుకే నా రెండున్నర నెలల కుమారుడిని ఎత్తుకుని ఇక్కడికి వచ్చాన’’ని సరోజ అహిర్ పేర్కొన్నారు.
తాము అన్ని పనులు ఎంతో సమర్థవంతంగా చేయగలమని నిరూపితమైంది. అటు తల్లిగా ఇటు ప్రజాప్రతినిధిగా విధులు నిర్వహిస్తున్న సరోజ పనితీరుపై అన్ని చోట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.