వేతన ఒప్పందం కోసం సమ్మెకు సిద్ధం…
-సింగరేణి పూర్వ వైభవం BMS తోనే సాధ్యం
-రాజకీయ జోక్యంపై కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలి
-బీఎంఎస్ జాతీయ బొగ్గు గనుల ఇంచార్జీ కొత్తకాపు లక్ష్మరెడ్డి
BMS leader Kottakapu Lakshmareddy: బొగ్గు గని కార్మికుల11వ వేతన ఒప్పందం కోసం సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని BMS జాతీయ బొగ్గు గనుల ఇన్చార్జీ, జేబీసీసీఐ సభ్యులు కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. భూపాలపల్లి సుభాష్‌కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఆదివారం బీఎంఎస్ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు.. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 24 వేల కోట్ల బకాయిలను గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేయడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందన్నారు.
జేబీసీసీఐ సమావేశంలో 11వ వేతన ఒప్పందంలో 28 శాతానికి తగ్గకుండా పెంచాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కేంద్రం, కోల్ఇండియా కేవలం 10 శాతం మాత్రమే వేతన ఒప్పందం పెంచేందుకు సుముఖంగా ఉందన్నారు. గత నెలలో జరిగిన సమావేశాన్ని BMS బహిష్కరించి బయటకు వచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమం ద్వారా కోల్ ఇండియా,సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి పెరిగిందన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి త్వరతగతిన వేతన సవరణ ఒప్పందం జరిగే విధంగా చూస్తానని చెప్పారని, దానిని స్వాగతిస్తామన్నారు. జనవరి 7న రాంచీలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మేళనం నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
ఆ కార్యక్రమంలో తదుపరి ఆందోళన కార్యక్రమాలు నిర్ణయిస్తారని వెల్లడించారు. అవసరమైతే నిరవధిక సమ్మె చేసి దేశంలోని బొగ్గు గని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం కోసం BMS కృషి చేస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 2003 జనవరి 7న అన్ని జాతీయ కార్మిక సంఘాలతో రాంచీలో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. దేశంలో అన్ని బొగ్గు గనుల్లో రక్షణ కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంటే.. సింగరేణి యాజమాన్యం మాత్రం రక్షణ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంవత్సరం ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని లక్ష్మారెడ్డి అన్నారు. కార్మికుల ప్రాఫిడెంట్ ఫండ్ కార్యాలయాన్ని పూర్తిగా అన్లైన్∙చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సింగ సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ వేతనాలు అమలు చేయడం లేదన్నారు. నామమాత్రపు వేతనాలతో కార్మికులను శ్రమదోపిడి గురి చేస్తున్నారన్నారని తెలిపారు. రెగ్యులర్ కార్మికులతో సమానంగా సెలవులు, బోనసులు, మెరుగైన వైద్య సేవలు అమలు చేయాలని BMS డిమాండ్ చేస్తోందన్నారు.
సింగరేణిలో రాజకీయ జోక్యం శ్రుతి మించిపోయిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరికి వారే అందిన కాడికి సింగరేణి నిధులను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా ఇంత రాజకీయ జ్యోకం జరగలేదన్నారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ప్రైవేటీకరణ జరుగుతోందన్నారు. అంతర్గత ప్రైవేటీక రణ ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో సింగరేణిలో ఉద్యోగాలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని అన్నారు. సంస్థ నిర్వీర్యానికి కుట్రలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా BMS నిర్వహించే పోరాటంలో భాగస్వామ్యం కావాలని కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు.
భూపాలపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు అప్పని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యుడు మాధవనాయక్, SCMKS అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ABKMS జాతీయ కార్యవర్గ సభ్యులు రమాకాంత్, పవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పేరం రమేష్, V.సుజేందర్ బ్రాంచి కార్యదర్శి రేనుకుంట్ల మల్లేష్, బ్రాంచి నాయకులు పండ్రాల మల్లేష్ ట్రెజరర్ బోయిన వెంకటస్వామి, బత్తుల స్వామి, R.జనార్ధన్, ఓరం లక్ష్మణ్ కొత్తూరి మల్లేష్, కటకం శ్రీనివాస్, D నారాయణ, R సాగర్, అన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.