కొత్త ఆశలు తీర్చే కల్పవల్లి 2023

New Year:గతిస్తున్న సంవత్సరంలోని గాయాలను
చెరిపివేస్తూ, నూతన జ్ఞాపకాలను పదిల
పరచుకునేందుకు, నిషి రాత్రిలో వెలుగుల మొలకలను పదిలంగానే మోసుకొస్తుంది కొత్త వత్సరం.

ఉన్నత శిఖరాలకు ద్వారాలను తెరుస్తూ
ఉజ్వల భ‌విష్య‌త్‌ కార్యాచరణ లిఖించుకోమంటూ,
చీకటిని తరిమివేస్తూ..
వెలుగుల ఆనందం హేళితో అడుగిడుతుంది
నూతన వత్సరం.

సంక్రాంతి సంబరాలు,
ఉగాది పచ్చడి విశిష్టతను తనలోనే నిలుపుకుని
క్రొంగొత్త ఆశలకు ఊపిరి పోస్తూ…నవకన్యలా
కదలి వచ్చేస్తుంది మరో నూతన వత్సరం

ప్రతి తరుణిలో నూతనోత్సాహం నింపేస్తూ…
వచ్చేస్తుంది కొత్త ఆశలు తీర్చే కామధేనువులా
సరికొత్త ఆనందాలు అందించేందుకు …
వచ్చేస్తుంది కొత్త సంవత్సరం .

ప్రకృతి పరవశిస్తూ సుగంధ భరితమైన
సువాసనలు వెదజల్లగా
సరికొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తూ…
వచ్చేస్తుంది ఈ కొత్త సంవత్సరం 2023..!
మీకు , మీ ఆత్మీయులకు , శ్రేయోభిలాషులకు,
మరియూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

మంజుల పత్తిపాటి (కవయిత్రి )
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
బ్రాహ్మణ సేవా వాహిని
యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like