బైరి నరేశ్ ను అరెస్ట్ చేసిన సిరొంచ పోలీసులు
Sironcha police arrested Bairi Naresh: బైరి నరేశ్ ను సిరొంచ పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా పర్గి జైల్లో ఉన్న నరేష్ ను పీటి వారెంట్ మీద తీసుకెల్లారు. అనంతరం అక్కడి పోలీసులు సిరొంచా కోర్టులో ప్రవేశ పెట్టారు. సిరోంచ పరివర్తన భవన్లో జరిగిన సభలో నరేశ్ అయ్యప్ప పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అక్కడ కేసులో పోలీస్ లు తీసుకెల్లారు. నరేశ్ తో పాటు దుర్గం వెంకటి పై సైతం సిరోంచ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటి పరారీలో ఉన్నాడు. కేస్ కి సంబందించిన వివరాలు సిఐ విస్వాస్ జాదవ్ వెల్లడించారు.