ప్రాణం తీసిన దాగుడుమూతలు
Komuram bheem Jilla:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దాగుడుమూతలు ఆడుకుంటుండగా పత్తిలో చిక్కుకుని, ఊపిరాడక ఓ బాలుడు మరణించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో అభిషేక్ (10) తన తమ్ముడు, చెల్లితో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటున్నాడు. తమ్ముడు, చెల్లికి దొరకొద్దని ఇంట్లో నిల్వ ఉన్న పత్తిలో దాక్కున్నాడు. చిన్న రంధ్రం చేసి, తల లోపలికి పెట్టాడు. దీంతో ఊపిరాడక మృత్యు వాత పడ్డాడు.