టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి

MLA attack on toll plaza staff: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. చిన్నయ్య బెల్లంపల్లి నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న సమయంలో టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే దిగి సిబ్బంది పై చేయి చేసుకున్నాడు. దాడి చేసే దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే గొడవ ఎందుకు జరిగింది అనే దానిపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. వీఐపీలు, అంబులెన్స్ వాహనాలకు దారి ఇవ్వకపోగా ఎమ్మెల్యేను ప్రశ్నించాడని, చిన్నయ్యకు టోల్గేట్ సిబ్బంది దురుసుగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా సమాధానం ఇవ్వడంతో వారిపై ఎమ్మెల్యే దాడి చేసినట్లు తెలుస్తోంది.