అన్ని యూనియన్లకు సమాన గుర్తింపు ఇవ్వండి
బెల్లంపల్లి ఏరియా జీఎంకు వినతిపత్రం

బెల్లంపల్లి ఏరియాలో అన్ని యూనియన్లకు సమానంగా గుర్తింపు ఇవ్వాలని జాతీయ కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డికి ఐదు జాతీయ సంఘాల నేతలు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కాల పరిమితి ముగిసిందని స్పష్టం చేశారు. 2017 అక్టోబర్ 5 వ తేదీనా సింగరేణి ఎన్నికలు నిర్వహించగా, 2019 అక్టోబర్ 5 నాటికి కాలపరిమితి ముగిసిందన్నారు. దీనిపై రీజినల్ సెంట్రల్ లేబర్ కమిషనర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అందుకే బెల్లంపల్లి ఏరియా కార్మిక సమస్యలపై చర్చించడానికి , సంప్రదింపులు ఇతర కార్యక్రమాలకు రిజిస్టర్డ్ కార్మిక సంఘాలైన తమకు కూడా అనుమతి ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి రీజినల్ లేబర్ కమిషనర్ వీటి థామస్ సింగరేణి యజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారన్నారు. హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో ఐదు జాతీయ సంఘాలు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా హెచ్ ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు రాజబాబు బ్రాంచ్ సెక్రటరీ మెంగని శివారెడ్డి, మంచర్ల శ్రీనివాస్, ఐఎన్టీయూసీ సీనియర్ ఉపాధ్యక్షులు సిద్ధం శెట్టి రాజమౌళి, ఎంబడి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, ఏఐటీయూసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మారం శ్రీనివాస్, జూపాక రాజేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు