మోడీ పర్యటన వాయిదా

Modi’s visit to Telangana postponed: తెలంగాణలో ప్రధానమంత్రి మోడీ పర్యటన వాయిదా పడింది. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ మూడు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. 19న‌ సికింద్రాబాద్‌లో వందే భారత్ రైలు ప్రారంభించడంతో పాటు సికింద్రాబాదు- విజయవాడ మధ్య రైల్వే ఆధునీకరణ పనులకు శంఖుస్థాపన, కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది.

ఈ కార్యక్రమాలతో పాటు పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభకు కూడా రాష్ట్ర బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. ప్రదాని మోదీ పర్యటన వాయిదా పడడంతో ఈ పనులన్నీ వాయిదా వేసినట్లు సమాచారం. కొద్ది రోజుల తర్వాత ప్రధాని పర్యటన ఎప్పుడనేది తేదీలు ప్రకటించనున్నారు.

అయితే ఇదే నెలలో మరో రోజు తెలంగాణలో మోడీ పర్యటన ఉండే అవకాశం ఉంది. మరో వైపు ఈ నెలలోనే అమిత్ షా, మోడీ, ఫిబ్రవరిలో జేపీ నడ్డా టూర్ లు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like