పేకాట, కోడిపందాలు ఆడితే చర్యలు తప్పవు
Cock Fighting: సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు, పేకాట ఆడినా నిర్వహించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్ హెచ్చరించారు. నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమానిత కోడి పందెంలు ఆడే వారిని పిలిపించి వారికి సీఐ విద్యాసాగర్, ఎస్ఐ నరేష్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని బైండోవర్ చేశారు.
సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ… అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంటుందన్నారు. కోడిపందాలు, పేకాట నిషేధమని, దానికి అనుమతులు లేవని స్పష్టం చేసారు. ఎక్కడైనా ఆడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా కోడి పందాలు నిర్వహించినా, పేకాట ఆడినా చర్యలు తప్పవన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పేకాట కోడి పందాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.