ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి
కమలాపురం 11వ వార్డు అభ్యర్థి కొప్పోలి సలీల
కడప జిల్లాలోని రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీ లతో పాటు గ్రామపంచాయతి ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే.ఈ మేరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కమలాపురం మున్సిపాలిటీ 11వ వార్డు అభ్యర్థిగా కొప్పోలి సలీల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సలహా మండలి చైర్మన్ సంబత్తూరు ప్రసాద్ రెడ్డి, ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షుడు జాన్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్యర్ధి కొప్పోలి సలీల మాట్లాడుతూ తన అభ్యర్థిత్వం ఖరారు చేసిన ఎంఎల్ఏ రవీంద్రనాథ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందని అవే తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు.