ఆసుపత్రి శుభ్రం చేయండి
మందు బాబులకు శిక్ష విధించిన మంచిర్యాల జడ్జి
Mancheriyal Judge: మందుబాబుల్లో పరివర్తన వచ్చేలా మంచిర్యాల జడ్జి తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే..ఇటీవల మంచిర్యాల పట్టణ పరిధిలో జరిపిన డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 13 మందిని ట్రాఫిక్ పోలీసులు ఫస్ట్ క్లాస్ అడిషనల్ జుడిషియల్ మేజస్ట్రేట్ ఉపనిషత్ వాణీ ఎదుట హాజరు పరిచారు. 13 మంది మందు బాబులకు రెండు రోజులపాటు ఆసుపత్రిలో శుభ్రత పనుల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు హెల్త్ సెంటర్ నందు శుభ్రత నిమిత్తం పని చేయవలసిందిగా ఆదేశించారు. అలా చేయని పక్షంలో వారికి పదిరోజుల సాధారణ జైలు శిక్ష అమలవుతుందనీ స్పష్టం చేశారు.
శిక్ష పడిన వారి వివరాలు…
1)బొమ్మ మొగిలి s/o సర్వయ్య, నివాసం రామకృష్ణాపూర్
2) చిలుక శ్రీహరి s/o చంద్రయ్య, నివాసం కాలేజీ రోడ్డు మంచిర్యాల్
3) గోళం రమేష్ s/o పోచయ్య, నివాసం రెబ్బెన ఆసిఫాబాద్ జిల్లా
4) బిబ్బర సతీష్ s/o కొమురయ్య, నివాసం: తిలక్ నగర్ మంచిర్యాల్
5) పిట్టల సాంబయ్య s/o రాయమల్లు నివాసం మందమర్రి,
6) ఎల్.డి మహేందర్ s/o రాజయ్య, నివాసం ఆరేపల్లి, భీమారం,
7) అలుగోజు వీరాచారి s/o కనకయ్య,నివాసం: హమాలివాడ మంచిర్యాల్
8) అడేపు లక్ష్మణ్ s/o సాంబయ్య, నివాసం మందమరి.
9)రాపర్తి ఆనంద్ s/o రవి, r/o. మందమర్రి
10) పెద్ది సురేష్ s/o శంకర్, r/o: పులిమడుగు.
11) భీమా సతీష్ కుమార్ s/o బోయపల్లి , తాండూర్
12) మహమ్మద్ షార్ఫుద్దీన్ s/o షాబోద్దీన్ , r/o జఫర్ నగర్ , మంచిర్యాల
13) మొహమ్మద్ మాజీద్ ఖాన్ s/o ఫాదఖాన్ , r/0: LIC కాలనీ , మంచిర్యాల
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమ వాహనాన్ని నడపాలన్నారు. మద్యం సేవించి ఎవరు వాహనాలను నడపవద్దని శిక్షలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.