శ్రీవారి దర్శనం – వసతి మీ చేతిలోనే..!!
భక్తుల సౌకర్యార్థం కొత్తగా యాప్
తిరుపతి వెళ్లే భక్తులు ఇక నుంచి దర్శనం.. వసతి కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ బుకింగ్ కు మాత్రమే అవకాశం అందుబాటులో ఉంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే కొండ పైన వసతి గదులు.. శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. కానీ, ఇప్పుడు కొత్తగా టీటీడీ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ను టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి..ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా నిత్యం భక్తులకు కావాల్సిన తాజా సమాచారం అందించనుంది.
యాప్ ద్వారా భక్తులు తిరుమలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్ చేసుకోవచ్చు.. అలాగే తిరుమలకు సంబంధించి సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంటుంది. తిరుమల శ్రీవారికి విరాళాలు కూడా అందజేయొచ్చు. కొంతకాలం కిందట టీటీడీ అధికారులు గోవింద యాప్ తీసుకొచ్చారు. కానీ, దాని వలన భక్తులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. దీంతో, ఇప్పుడు నిత్యం భక్తులకు కావాల్సిన సమాచారంతో కొత్త యాప్ తీసుకొచ్చారు.
TTDevasthanam యాప్ డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా అన్ని రకాల సేవలు ఒకే చోట పొందే అవకాశం కలుగుతుంది. శ్రీవారి సేవలు జరిగే సమయంలోనే సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాప్ లో ఎస్వీబీసీ కార్యక్రమాలను వీక్షించే అవకాశం సైతం కల్పించారు.
టీటీడీ దేవస్థానం కొత్తయాప్ డౌన్లోడ్ కోసం ఈ కింద లింక్ క్లిక్ చేయండి..
https://play.google.com/store/apps/details?id=com.ttdapp