తెలంగాణలో కలెక్టర్ల బదిలీలు
Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లోని కలెక్టర్లను బదిలీ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మొత్తం 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే 94 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. జిల్లాల కలెక్టర్ల పాటుతో వివిధ ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శులు కూడా బదిలీ అయ్యారు. మంచిర్యాల కలెక్టర్, ఐఏఎస్ అధికారి భారతీ హోలికెరిని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నిమించారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్‌ను నియమించారు.
రంగారెడ్డి కలెక్టర్‌గా హరీశ్, మంచిర్యాల కలెక్టర్‌గా బి సంతోష్, మెదక్ కలెక్టర్‌గా రాజశ్రీ షా, జగిత్యాల కలెక్టర్‌గా కర్ణణ్, మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా జి. రవి, సూర్యాపేట కలెక్టర్‌గా వెంకట్రావు, వనపర్తి కలెక్టర్‌గా పవార్, నిర్మల్ కలెక్టర్‌గా వరుణ్ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆసిఫాబాద్ కలెక్టర్‌గా షేక్ యాషిన్ భాషను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.