బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరిన నాందేడ్ నాయకులు..
కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్
BRS: భారత్ రాష్ట్ర సమితి పార్టీలో నాందేడ్ వాసులు భారీ సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాందేడ్ జిల్లాకు చెందిన పలు గ్రామాల సర్పంచ్లు, యువకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలకనేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మాజీ ఎంపీలతో సహా సరిహద్దు గ్రామాలకు చెందిన దాదాపు 40 గ్రామాలకు పైగా సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.