బడ్జెట్‌లో ఎవరికి ఎంత కేటాయించారంటే..
Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. శాసనసభలో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 2023-24 ఏడాదికి రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి రాష్ట్రం చేరుకుందని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం అన్నారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు.
రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు
మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు
వ్యవసాయానికి కేటాయింపులు: రూ. 26,831 కోట్లు
నీటి పారుదల రూ. 26,885 కోట్లు
విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థ రూ. 3117 కోట్లు
ఆసరా ఫించన్ల కోసం రూ. 12,000 కోట్లు
దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు
ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
ఎస్టీ ప్రత్యేక నిధి కోసం. రూ.15, 233 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
అటవీ శాఖ కోసం రూ. 1, 471 కోట్లు
విద్య కోసం రూ.19, 093 కోట్లు
వైద్యం కోసం రూ.12,161 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ. 3,117 కోట్లు
ఆయిల్ ఫామ్‌కు రూ. 1,000 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 3,210 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు
హరితహారం పథకానికి రూ. 1,471 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11,372 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ. 2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 4,037 కోట్లు
హోం శాఖకు రూ. 9,599 కోట్లు
రైతు బంధు పథకానికి రూ. 1,575 కోట్లు
రైతు బీమా పథకానికి రూ. 1,589 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ. 200 కోట్లు
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకానికి రూ. 4,834 కోట్లు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రూ. 12,000 కోట్లు
ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1,463 కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు
ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు ప్రతిపాదించారు.