ప్రజా సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం
హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

Congress: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాసంక్షేమం సాధ్యమని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్పష్టం చేశారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా లక్షెట్టిపేట మండలం ఎల్లారంలో పాదయాత్ర చేపట్టారు. అంతకు ముందు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే పేద, మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయాలు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు.