చిన్నారులను సన్మానించిన నడిపెల్లి విజిత్
Manchiryal:మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థినీలు పలు అంశాల్లో ప్రతిభ కనబరిచిచారు.యోగిత శ్రీ (6వ తరగతి) గత నెలలో కూచిపూడి నాట్యంతో వరల్డ్ రికార్డు సాధించింది. రవీంద్రభారతిలో జరిగిన సంక్రాంతి నంది పురస్కారాలు లో నంది బహుమతి అందుకుంది. సాయి శ్రీవల్లి (8వ తరగతి) జాతీయ సైన్స్ ఫెయిర్ లో ప్రధమ బహుమతితో పాటు కూచిపూడిలో నాట్యమయూరి అవార్డ్ అందుకుంది. శ్రీనిత (8వ తరగతి) చినజీయర్ స్వామి అవార్డ్ అందుకుంది ఈ ముగ్గురు విద్యార్థినీలు BRS రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ బుధవారం ఎమ్మెల్యే స్వగృహంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అది రోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పిల్లల్ని తీర్చి దిద్దిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులను సైతం ఆయన అభినందించారు.