పోగొట్టుకున్నచోటే

-మ‌ళ్లీ రికార్డు స్థాయిలో పెరిగిన అదానీ సంప‌ద‌
-ఒక్కరోజులోనే రూ. 3,553 కోట్లు సంపాదన‌
-బ్లూంబర్గ్ బిలియనీర్ల జాబితాలో సరికొత్త రికార్డు

పొగొట్టుకున్న చోటే వెతుక్కోవ‌డం అంటే ఖ‌చ్చితంగా ఇదే.. అదానీ సంప‌ద ఎంత వేగంగా క‌రిగిపోయిందో… అంతే వేగంగా పెరుగుతోంది. గౌత‌మ్ అదానీ ఒక్క రోజులోనే నాలుగు బిలియ‌న్ డాల‌ర్ల మేర సంపాదించారు.

అదానీ గ్రూప్‌ కృత్రిమంగా షేరు ధరలను పెంచుతోందనే ఆరోపణలతో అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ గత నెలలో ఓ నివేదికను ప్రచురించింది. ఆ తర్వాత అదానీ కంపెనీ షేర్లు భారత స్టాక్ మార్కెట్‌లో మరెన్నడూ లేని విధంగా పడిపోయాయి. దీంతో కంపెనీ 100 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. కేవలం 10 రోజుల్లో అదానీ సామ్రాజ్యం కుప్పకూలింది. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత 10 రోజుల్లోనే అతని సంపద 58 బిలియన్ యుఎస్ డాలర్లకు పడిపోయింది.

గౌతమ్ అదానీ బుధవారం తన సంపదలో 4.3 బిలియన్ అమెరికన్ డాలర్లను ఒకేరోజులో చేర్చుకున్నారు. అంటే అదానీ సంపద ఒక్కరోజులోనే రూ. 3,553 కోట్ల రూపాయల మేర పెరిగింది. దీంతో అతని నికర విలువ 64.9 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అయితే ఈ లిస్టులో అదానీ తర్వాత ఎలాన్ మస్క్ రెండో స్థానంలో ఉన్నాడు. క్లాస్-మిచెల్ కుహెన్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. బుధవారం ఒక్కరోజే ఆయన సంపద 1.9 బిలియన్ అమెరికన్ డాలర్లు పెరిగింది.

బుధవారం అదానీ ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఒకే రోజు అత్యధిక సంపద పొందిన వ్యక్తి అయ్యాడు. అంతేకాదు, ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్‌లో ఒక్కరోజులో ఇంత మొత్తంలో సంపదను ఆర్జించిన మొదటి వ్యక్తి కూడా అదానీయే అవడం విశేషం. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్, ప్రపంచంలోని అత్యంత సంపన్నులు ప్రతిరోజూ ఎంత సంపదను కూడగట్టారు అనే దాని ఆధారంగా జాబితాను అప్‌డేట్ చేస్తుంటారు. ఫిబ్రవరి 8న గౌతమ్ అదానీ ప్రపంచంలోనే అత్యధికంగా సంపదను పోగుచేసిన వ్యక్తిగా నిలిచాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like