దేశంలో తొలిసారిగా లిథియం నిక్షేపాల గుర్తింపు
Jammu And Kashmir: దేశంలోనే తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో లిథియం నిక్షేపాలను కనుగొన్నారు. జమ్మూ కాశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రియాసి జిల్లాలో సలాల్ – హైమనా ప్రాంతంలో లిథియం నిక్షేపాలను గుర్తించినట్టు గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలలో కీలకమైన భాగాలలో ఈ లోహం ఒకటి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ సమయంలో లిథియం నిల్వలు బయటపడటం ప్రభుత్వాలకు ఎంతో మేలు చేయనుంది.