ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వం
Mancheiryal: మహిళల సంక్షేమం కోసమే కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మండలం అంకత్పల్లిలో రూ.5 లక్షలతో నిర్మిస్తున్న డ్వాక్రా మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ తిప్పని లింగన్న, సర్పంచ్ ఘనవేని శైలజ, ఎంపీటీసీ కళ్ళు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.