ఆసిఫాబాద్ కలెక్టర్ గా హేమంత్ సహదేవ్ రావు
Komuram bheem Asifabad: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా హేమంత్ సహదేవ్ రావును నియమించారు. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హేమంత్ 2016 బ్యాచ్ కి చెందిన వారు కాగా, ప్రస్తుతం నిర్మల్ అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పలువురు ఐఎఎస్ లు బదిలీ కాగా ఆసిఫాబాద్ జిల్లాకు షేక్ యాష్మిన్ బాషా నూ కలెక్టర్ గా బదిలీ చేసారు. అయితే అమె ఇక్కడకు వచ్చేందుకు సుముఖంగా లేకపోవడం, వేరే జిల్లాకి కేటాయించాలని ఉన్నతాధికారులకు చెప్పడం తో ఆమె బదిలీ రద్దు చేశారు. తాజాగా హేమంత్ సహదేవ్ రావు నీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.