పడిపోయిన ఉష్ణోగ్రతలు… పెరిగిన చలి తీవ్రత
సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఉష్ణోగ్రతలు
Weather: తెలంగాణ చలితో గజగజ వణికిపోతోంది. రెండు రోజులుగా రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యాయి.
కొమురం భీం జిల్లా సిర్పూర్ (యూ) 6.7, డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారంలో 7.4, అర్లి(టి) 7.6, కవ్వాల్‌లో 7.7, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ 8.9, నిర్మల్ జిల్లా జామ్ లో 10.6గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. మరోవైపు పగటిఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి.