సింగరేణి చోరీ సామాగ్రి పట్టివేత
Singareni: సింగరేణి సంస్థకు సంబంధించిన చోరీ సొత్తు ఎస్అండ్‌పీసీ సిబ్బంది పట్టుకున్నారు. కొద్ది రోజులుగా దొంగలు తాండూరు మండలం మాదారం టౌన్షిప్‌లో ఉన్న ఇనుప సామాగ్రి ఎత్తుకెళ్తున్నారు. గుట్టకింద ఏరియా, గ్రౌండ్‌లో ఉన్న ఇనుప సామాను తవ్వుకుని మరీ వెళ్తుండటం గమనార్హం. ఖాళీగా ఉన్న క్వార్టర్లు, చివరకు గ్రౌండ్‌లో ఉన్న వాటిని సైతం ట్రాలీల్లో వేసుకుని తరలిస్తున్నారు. లక్షల విలువైన సామాగ్రి ఇలా చోరుల పాలవుతోంది. దీంతో నిఘా పెట్టిన ఎస్అండ్‌పీసీ సిబ్బంది ఆటో ట్రాలీలో తరలిస్తున్న సామాగ్రి పట్టుకుని పోలీస్‌స్టేషన్ తరలించారు. ఎస్అండ్‌పీసీ ఇన్స్పెక్టర్ రాజమౌళి, జమేదార్ శంకర్, సెక్యూరిటీ గార్డ్ కందుల మల్లేష్ తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారు.