ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం
నిరుద్యోగి ఆసంపల్లి మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన విప్ బాల్క సుమన్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన
మంచిర్యాల – ఆసంపల్లి మహేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన కోటపల్లి మండలం లోని బబ్బెరుచెలుకలో ఆసంపల్లి మహేష్ చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారు. మహేస్ సోదరికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. అదే గ్రామంలో ఇటీవల పిడుగుపాటుతో మరణించిన ముక్కనవేణి కోటేష్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించివారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయం కింద 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగినది. తహసీల్దార్‌తో మాట్లాడి ప్రభుత్వ పరంగా అందవలసిన ఎక్స్‌గ్రేషియా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జండా వాడకు చెందిన కమ్మల రాజేష్ చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. . అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం కింద రెండు లక్షల రూపాయలు అందించారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధి పనుల పరిశీలన..
ఈ సందర్భంగా బాల్క సుమన్ పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. చెన్నూరు పట్టణంలో ఏడు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన పనులను పరిశీలించారు. అదేవిధంగా రెండు కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించి, అనంతరం పట్టణంలోని రైతులతో మాట్లాడారు. చెన్నూరు పట్టణం నడిబొడ్డున రెండున్నర కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న కేసీఆర్ పార్కు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.