ముల్కల్ల గోదావరి పుష్కర ఘాట్ మూసివేత
Closure of Mulkalla Godavari Pushkara Ghat: గోదావరిలో లోతు ఎక్కువగా ఉన్నందున ముల్కల్ల గోదావరి పుష్కర ఘాట్ మూసివేస్తున్నట్లు మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి అన్నారు. గురువారంట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి ఏసీపీ పుష్కర్ ఘాట్ పరిశీలించారు. ఈ సందర్భంగ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని నలుమూలల నుండివచ్చే ప్రజలు ముల్కల్ల పుష్కర ఘాట్ వద్ద స్నానాలు చేయడానికి రావద్దని కోరారు. లోతు ఎక్కువగా ఉన్నందున ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజలందరూ ముల్కల్ల పుష్కర ఘాట్ వద్దకు రావద్దని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ. సంజీవ్, ఎస్.ఐ. ఉదయ్ కిరణ్, తహసీల్దార్ రాజలింగం, ఎంపీడీఓ. ఎం.ఏ.హై, సర్పంచ్ మంచాల శ్రీనివాస్ ఉన్నారు.