శివోహం…
-మారుమోగుతున్న శివాలయాలు
-పెద్ద ఎత్తున పూజలు, అభిషేకాలు
Temples-resounding-with-the-name-of-shivaమహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. అర్థరాత్రి నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.
మంచిర్యాల జిల్లాలో వేలాల మల్లన్న జాతర అద్భుతంగా కొనసాగుతోంది. ఇక్కడకు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అటు పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో భక్తులు మల్లన్న దర్శనం చేసుకుంటున్నారు. అనంతరం బోనాలు సమర్పిస్తున్నారు. తాండూరు మండలంలోని బుగ్గ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో సైతం భక్తులు బారులు తీరి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఆసిఫాబాద్ కొమురంభీమ్ జిల్లా ఈస్‌గాం మల్లన్న, రెబ్బన మండలం నంబాలలో సైతం భక్తులు బారులు తీరారు. దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది. అయినా భక్తులు ఓపికతో ముక్కంటి దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.