డీసీఎంలో మంటలు.. మిర్చి బస్తాలు దగ్దం
Bellampalli: బెల్లంపల్లిలో మిర్చిలోడ్తో వెళ్తున్న డీసీఎంలో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న మిర్చి బస్తాలు దగ్ధమయ్యాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల హనుమాన్ విగ్రహం ముందు జాతీయ రహదారిపై డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని నందిగామ నుంచి మహారాష్ట్ర కు మిరప లోడ్ తో వెళ్తున్న డీసీఎంకు విద్యుత్ తీగలు తగిలి మిరప బస్తాలు అంటుకున్నాయి. దీంతో స్థానికులు గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పాటు అంటుకున్న బస్తాల్లో కొన్నింటిని కింద పడేశారు. అంటుకున్న మిరప బస్తాలు సుమారు 15 కాలి బూడిద అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.