ఎన్ కౌంటర్ లో ఇద్దరు పోలిసులు మృతి
Encounter: ఛత్తీస్‌గఢ్ లో సోమవారం జరిగిన ఓ ఎన్ కౌంటర్లో ఇద్దరు పోలిసులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నంద్‌గావ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నంద్‌గావ్ బోర్తలాబ్ పోలీసు స్టేషన్ పరిధిలో జవాన్ల పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ సంద్భంగా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మృతులు హెడ్‌కానిస్టేబుల్ రాజేష్, కానిస్టేబుల్ లలిత్‌గా గుర్తించారు. పోలిసులు మరిన్ని భద్రతా దళాలను రప్పించి కూంబింగ్ చేపట్టారు.