చెన్నూర్ మార్కెట్ కమిటీ నియామకం
Manchiryal: చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మల్లెల దామోదర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా భైస ప్రభాకర్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నూరు మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చెన్నూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా..
1) మెండె హేమలత
2) భూక్య రాజ్ కుమార్
3) రుద్రబట్ల సంతోష్
4) ఖాజా కొమురుద్దీన్
5) మద్ద మధుకర్
6) మాణికరౌతు శంకర్
7) భీమ్ మధుకర్
8) గాదె శ్రీనివాస్
9) కంకణాల సంపత్ రెడ్డి
10) మోర్ల లక్ష్మణ్
11) జూలూరి మనోహర్
12) ఉమేష్ చంద్ లను నీయమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు నూతనంగా ఎన్నికైన సభ్యులకు ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నూరు మండలానికి చెందిన మల్లెల దామోదర్ రెడ్డి గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. గతంలో కోటపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన భైస ప్రభాకర్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతులతో మమేకమై సమస్యలను నేరుగా తెలుసుకోవాలని కోరారు. సత్వర పరిష్కారానికి చొరవ చూపాలని నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు. క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు బాల్క సుమన్ సూచించారు.