హరీష్ రావు పర్యటన.. ముందస్తు అరెస్టులు
Harish Rao:రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావ్ అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో బుధవారం పర్యటించనున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలిసులు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు. తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్, పెందోర్ పుష్పరాణినీ అరెస్ట్ చేశారు.వారిని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెళ్లి శ్రీధర్ను మావల SI విష్ణు వర్ధన్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మహ్మద్ ఇసాక్ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ తరలించారు.