రాజన్న హుండీ ఆదాయం రూ. 1.82 కోట్లు
Vemulavada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయం హుండీల లెక్కింపు బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో నిర్వహించారు. 15 రోజుల హుండీ ఆదాయం ఒక కోటి 82 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి డి.కృష్ణ ప్రసాద్ తెలిపారు.1కోటి, 82లక్షల, 409 రూపాయల నగదు, బంగారం 309 గ్రాముల 500 మిల్లీ గ్రాములు, వెండి 19 కిలోల 460 గ్రాములు వచ్చింది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.