గనిలో గ్యాస్ లీక్.. తప్పిన పెనుప్రమాదం
Singareni: సింగరేణి బొగ్గు గనిలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ఎకార్మికులు అప్రమత్తం అవడటంతో ప్రమాడం తప్పింది.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ SRP 3 బొగ్గు గనిలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో గనిలో 23 మంది కార్మికుల విదులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్యాస్ లీకైన సమయంలో కార్మికులు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. రెస్క్యూ టీం రక్షణ చర్యలు చేపట్టి 23 మంది కార్మికుల ను సురక్షితంగా పైకి తీసుకువచ్చింది.