ఆసుపత్రిలోనే ఒక్కటైన జంట
Manchiryal: పెళ్లి ముహూర్తం ఖరారైంది. రెండు వైపుల వారూ అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ ఇంతలోనే వధువు అస్వస్థతకు గురయింది. ఆమెను ఆసుపత్రి తరలించారు. అయినా ముహూర్తం ఘడియలలోనే పెళ్లి అయింది.
ఆసుపత్రిలో ఆపరేషన్ చికిత్స పొందుతున్న వధువుకు వరుడు ఆసుపత్రిలోనే తాళి కట్టాడు. చెన్నూరు మండలం లంబాడి పల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి పెళ్లి నిశ్చయం అయింది. గురువారం వివాహం జరగాల్సి ఉంది. అయితే బుధవారం. ఆమె అస్వస్థత గురైంది. వెంటనే మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఓ ఆసుపత్రిలో ఆమెకు ఆపరేషన్ జరిగింది. పెండ్లి వాయిదా పడో ద్దనే ఉద్దేశంతో వరుడు ఆసుపత్రిలోనే బెడ్ పై ఉన్న శైలజకు తాళికట్టి భార్యగా చేసుకున్నాడు.
ఆసుపత్రిలోనే అయ్యగారిని పిలిపించి మరీ పెళ్లి తంతు జరిపించారు. ముహూర్తం దాటిపోవద్దనే అలా చేసినట్లు పెళ్ళి పెద్దలు వెల్లడించారు.